10-10-2025 11:34:03 PM
నకిరేకల్,(విజయక్రాంతి): హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బైక్ పై ఇద్దరు వెళ్తుండగా వెనక నుండి లారీ ట్యాంకర్ ఢీకొనడంతో ఒకరు వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్రగాయలు అయినా సంఘటన నకిరేకల్ బైపాస్ పద్మా నగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి యానాల విక్రమ్ రెడ్డి నకిరేకల్ పట్టణానికి చెందిన రావుల ప్రభు ఇద్దరు కలిసి బైక్ పై నగేష్ హోటల్ నుండి నకిరేకల్ కు వచ్చే క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా లారీ ట్యాంకర్ బైక్ ను వెనుక నుండి ఢీకొనడంతో యానాల విక్రమ్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు . రావుల ప్రభు తీవ్ర గాయాలు కావడంతో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.