calender_icon.png 20 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

20-08-2025 12:16:43 AM

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19, (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయి స్తే ఇప్పటి వరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందని యురియా సరఫరా లో కేంద్రం ప్రభుత్వం విఫలం అయ్యిందని తెలంగాణ రాష్ట్ర రైతు సం ఘంజిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం విమర్శించారు.

మంగళవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తె లంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్ర రైతులపై కేంద్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న ఏమి చేయ లేకపోతున్నారన్నారు., మతం, కులం పేరుతో ప్రజల ను రెచ్చగొట్టడం తప్ప కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర ఎంపీలు ఏమి సాధించారన్ని, బండి సంజయ్, కిషన్ రెడ్డి కి దమ్ముంటే ముందు యూరియా కోసం ప్రధానిని నిలదీయాలని డిమాండ్ చేశారు.

బిజెపి ఎంపి లు 8 మంది నోరుమూసుకొని ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన యూ రియా కోటాను తక్షణమే సరఫరా చేసే వి ధంగా ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర బిజెపి ప్రజా ప్రతినిధులు ధర్నా చేయాలని డిమాం డ్ చేశారు. రైతుల కోసమే తమ ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకునే మోడీ ప్రభు త్వం తాము పరిపాలిస్తున్న రాష్ట్రాలకు ఒక వి ధానం, విపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకు ఒక విధానం అవలంబిస్తుందని ఆరోపించారు.

వ్యవసాయ పనులు ప్రారంభమై వర్షాలు ప డుతున్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులపై సవితి తల్లి ప్రేమ చూపించ కుండా తె లంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటాను తక్షణమే సరఫరా చేయాలని లేని పక్షంలో రైతులను సమీకరించి పోరాటం చే యక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అ డుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.