calender_icon.png 26 August, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లకు కేంద్రం మోకాలడ్డు

26-08-2025 02:36:59 AM

- బిల్లులను ఆమోదించకుంటే బీహార్ ఓటర్లే బుద్ధి చెప్తారు..

- బీజేపీ జేబు సంస్థలుగారాష్ట్రపతి భవన్, రాజ్‌భవన్

- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండు బిల్లు లు చేసిందని, వాటికి రాష్ట్రపతి ఆమోదం తెలిపేందుకు కేంద్రప్రభుత్వం మోకాలడ్డుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

బీహార్ మాజీ సీఎం బీపీ మండల్ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం రాష్ర్టపతి భవన్‌తోపాటు రాజ్‌భవన్‌ను తమ జేబు సంస్థ లుగా మార్చుకుందని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం మండల్ నాడు అనేక సిఫార్సులు చేశారని, మండల్ కృషితోనే బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయని వెల్లడించారు.

మండల్ నా డు బీసీలకు 32 సిఫార్సులు చేస్తే ప్రభుత్వా లు రెండు మాత్రమే అమలు చేశాయన్నా రు. మిగతా 30 సిఫార్సులను ప్రభుత్వాలు 35 సంవత్సరాలుగా తొక్కిపెడుతున్నాయని ఆరోపించారు. బీసీ సంఘాల పోరాటం ఫలితంగా కాంగ్రెస్ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బి ల్లులు పెట్టి ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి పంపించిందన్నా రు.

బిల్లులు రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఐదు నెల లు అవుతున్నప్పటికీ, వాటికి ఆమోదం లభించడం లేదని వాపోయారు. బీసీ విద్యావంతుల వేదిక నేత ప్రొఫె సర్ సంగని మల్లేశ్వర్, బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్ శ్రీనివాస్, బీసీ నేతలు గూడూరు భాస్కర్, మధు పాల్గొన్నారు.