calender_icon.png 26 August, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీసీ పదవి ఎందుకు గౌరవించవు?

26-08-2025 02:36:46 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి)ః ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి సొల్లు పురాణం మాట్లాడారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. సోమవారం బీఆర్‌ఎస్ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం యాదయ్య, శ్రీకాంతాచారి ఆత్మబలిదానాలు చేసుకుంటే రేవంత్ మాత్రం చంద్రబాబు సంకలో ఉన్నారని ఎద్దేవా చేశారు.   సీఎం కుర్చీని గౌరవించాలని అంటున్న రేవంత్ రెడ్డి మంత్రి పదవిని, వైస్ ఛాన్సలర్ పదవిని ఎందుకు గౌరవించడం లేదని దాసోజు ప్రశ్నించారు. 

కోర్టుల్లో ఉన్న అంశాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని... కోర్టులను, కోర్టు తీర్పులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసేందుకు నిరుద్యోగులు బస్సులు వేసుకుని రాష్ర్టం మొత్తం తిరిగారని గుర్తుచేశారు.  60వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గుర్తించిన ఉద్యోగాలా... సృష్టించిన ఉద్యోగాలా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని రేవంత్‌కు భయం మొదలైందన్నారు. కోదండరాం పట్ల రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.