18-11-2025 10:35:42 PM
జడ్చర్ల: రైతులు ఆరుగాలం కష్టం చేసి వానకు నాని ఎండకు ఎండి, రాత్రి పగలు కష్టపడి పండించిన పత్తి పంటను అమ్మడానికి పోతే ఇన్ని పరిక్షలు పెట్టి కొనడం చాలా బాధాకరమని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడికల్ యాదయ్య అన్నారు. జడ్చర్ల ఇండ్రస్ట్రియల్ దగ్గర ఉన్న పత్తి కొనుగోలు(జిన్నింగ్ మిల్) కేంద్రం దగ్గర ఉన్న రైతులతో ఆయన మాట్లాడారు. ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొంటమని, మిగతాది దళారీలకు అమ్ముకోమనడం సిగ్గుచెటన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షణ రైతు పండించిన పత్తిని ఎలాంటి నిబంధనలు షరతులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడికల్ యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పిట్టల మురళి, బీఆర్ఎస్ నాయకులు ప్రనిల్ చందర్, శంకర్ నాయక్, ఇంతియాజ్, కొండల్, రవి నాయక్, సాగర్, కరాటే శ్రీను, రఫీ, పత్తి రైతులు పాల్గొన్నారు.