calender_icon.png 19 November, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారిని పరిశీలించిన సీఎం చీఫ్ సెక్రటరీ

18-11-2025 11:11:18 PM

చేవెళ్ల (విజయక్రాంతి): అప్పా జంక్షన్ నుండి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ వరకు నేషనల్ హైవే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజు పరిశీలించారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు అధికారుల బృందంతో కలిసి మొయినాబాద్, చేవెళ్ల బై పాస్ రోడ్ పనులను అధికారులు పరిశీలించారు. రోడ్ విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మేఘ కంపెనీ ప్రతినిధులకు ఆదేశించారు.

ప్రమాదానికి కారణమవుతున్న మలుపుల వద్ద రోడ్ విస్తరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. అయన వెంట కార్యక్రమంలో నేషనల్ హైవే ప్రాంతీయాధికారి (ఆర్వో) శివ శంకర్,మాజీ ఐఏఎస్ అధికారి సుందర్ అబ్నర్. చేవెళ్ల ఆర్డీవో కె. చంద్రకళ, మొయినాబాద్ తహ-సీల్దార్ కె. గౌతమ్ కుమార్, చేవెళ్ల తహసీల్దార్ బి. కృష్ణయ్య లతో పాటు మిషన్ భగీరథ SE చలమా రెడ్డి,మేఘ కంపెనీ ప్రతినిధి సురేష్, NH ప్రాజెక్ట్ డైరెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ రాజశే-ఖర్,స్థానిక గిర్దవర్లు రాజేష్  డిప్యూటీ సర్వేయర్ రత్నాకర్, మండల్ సర్వేయర్ జలజ తదితరులు పాల్గొన్నారు.