calender_icon.png 19 November, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైజింగ్ తెలంగాణ నినాదంతో ఇంటర్మీడియట్ బోర్డులో వినూత్న సంస్కరణలు

18-11-2025 11:30:29 PM

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అసోసియేషన్ 

ఖైరతాబాద్ (విజయక్రాంతి): రైజింగ్ తెలంగాణ నినాదంతో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి దిశానిర్దేశాల మేరకు బోర్డులో పలు పరిపాలనా సంస్కరణలు అమలు  కావడం పట్ల హర్షాన్ని ప్రకటించారు. ఈ ఆఫీస్ అమలు వల్ల ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా ఈ ఆఫీస్ విధానంలోకి మారిందన్నారు. కార్యక్రమ ఫైళ్లన్నీ డిజిటల్ విధానంలోనే నడుస్తుండడంతో పార-దర్శకత, వేగం పెరిగినట్టు తెలిపారు. నిధుల నిర్వహణకు ఎటువంటి బడ్జెటరీ సపోర్ట్ లేకున్నా, ప్రభుత్వం ఎంపానెల్ బ్యాంకుల్లో ఎఫ్ డి రూపంలో నిధులను పెట్టుబడి పెట్టి బోర్డు ఆర్థిక వ్యవ-స్థను సుస్థిరపరచినట్లు తెలిపారు.

ఫిబ్రవరి పరీక్షల దృష్ట్యా జిహెచ్‌ఎంసి  సూచనలతో పాటు ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సుల మేరకు టి జి ఈ డబ్ల్యు ఐ డి సి  ద్వారా మరమ్మత్తులు చేయించారని  ఆయన వెల్లడించింది. సిసిటివి పర్యవేక్షణ  కమాండ్ కంట్రోల్ సెంటర్ ల ద్వార ప్రశ్న పత్రాల లీకేజీలను అరికట్టేందుకుచర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. 2 నెలల ముందే పరీక్షలు నిర్వహణ కార్యక్రమా లను నిర్వహించి 70,000 మంది విద్యార్థులకు జీవిత నైపుణ్యాలు, మానసిక ఒత్తిడిని అధిగమించెందుకు శిక్షణను అందిస్తున్నారాన్నారు. 2026 ఇంటర్మీడియట్ పరీక్షలను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నా-మని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు మురళీధర్, ట్రెజరర్ ఎం. వంశీ కృష్ణ, కార్యదర్శి సయ్యద్ ఉస్సేన్  తదితరులు పాల్గొన్నారు.