18-11-2025 10:33:04 PM
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి (విజయక్రాంతి): కోడలుపై పెట్రోల్ పోసి హత్య చేసిన అత్తకు మంగళవారం కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిత ఖైదీ శిక్ష విధించడంతో పాటు పదివేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన బొడ్డు శంకర్ తన పెద్ద కూతురు కీర్తన ను అదే గ్రామానికి చెందిన కురాటి పండరి తో ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అయిన తర్వాత మృతురాలి అత్త కోరాటి అంబవ ప్రేమ వివాహం ఇష్టం లేక నిరంతరం కీర్తనలు వేధిస్తూ తిడుతూ కొడుతూ ఉండేది. బాధలు భరించలేక కీర్తన ఆమె భర్త పండరి హైదరాబాదులో కొన్ని రోజులు పని చేసుకుని బ్రతికినారు.
ఆరు నెలల తర్వాత భార్య భర్తలు తిరిగి గ్రామానికి వచ్చారు. 17 జూలై 2022 ఉదయం 9:30 గంటలకు కీర్తన పోయి దగ్గర కూర్చొని ఉండగా ఆమె అత్త అంబవ్వ తినాలి ఇంట్లో మోటార్ సైకిల్ నుంచి పెట్రోల్ తీసుకొని కేతన పై తల్లి పండించి చంపడానికి ప్రయత్నించింది. వంటలతో కాల్తున్న కీర్తన బయట ఇసుకలో మంట ఆరుపు కుంది. ప్రేమ వివాహంపై ఉన్న అసహనం కుమారునికి మరో పెళ్లి చేయాలా అభివృద్ధి దేశంతోనే ఘోర చర్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనది. ఈ కేసులో కుటుంబ సభ్యులను, గ్రామస్తులను చుట్టుపక్కల వారిని విచారించి సాక్షాలను సేకరించి నేరస్థురాలు అనుభవాన్ని అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రం వేశారు.
కేసులో సాక్షులను విచారించి సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగింద ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి హెచ్ వి ఆర్ ఆర్ వరప్రసాద్ నిందితురాలు అంబవకు జీవిత ఖైదీ శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ తరఫున వాదనలు వినిపించిన పి.పి రాజగోపాల్ గౌడ్ ఈ కేసును సరిగా పద్ధతులకు విచారణ చేసిన అప్పటి బాన్స్వాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి, నిజాంసాగర్ ఎస్ఐ రాజు, రక్త బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ రామేశ్వర్ రెడ్డి, సీడీవో కిషన్ లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.