calender_icon.png 19 November, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెకాలే బానిసత్వ భావజాలం వీడాలి

18-11-2025 11:16:15 PM

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ

న్యూఢిల్లీ : లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన బానిసత్వ భావజాలంను వీడాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు  పిలుపునిచ్చారు. మెకాలే ప్రవేశపెట్టిన ఈ చెడును, సామాజిక రుగ్మతలను రాబోయే దశాబ్దంలో పూర్తిగా రూపుమాపాలని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. మెకాలే విధానం భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, తక్కువగా చూసుకునే భావనను నింపిందన్నారు. మెకాలే ఉద్దేశపూర్వకంగానే నైపుణ్యం, పాండిత్యం రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇచ్చిన భారతదేశ పాత విద్యా వ్యవస్థ వెన్నెముకను విరిచారని, దీని ద్వారా బ్రిటీష్ భాష, ఆలోచనలకు ఎక్కువ గుర్తింపు దక్కేలా చేశారని మోదీ వివరించారు. ఈ ఆలోచనా విధానం కారణంగానే మహాత్మా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమానికి పునాదిగా వేసిన ’స్వదేశీ’ సిద్ధాంతం ప్రాధాన్యత కోల్పోయిందని తెలిపారు. ఒక దేశం తనను తాను గౌరవించుకోనప్పుడు, అది ’మేడ్ ఇన్ ఇండియా’ వంటి స్వదేశీ వ్యవస్థను కూడా తిరస్కరిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు.