calender_icon.png 19 November, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24 నుంచి టెట్ ఎడిట్ ఆప్షన్లు

18-11-2025 11:14:32 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 24 నుంచి ఎడిట్ చేసుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో అభ్యర్థులు ఏమైనా పొరపాట్లు, తప్పులు దొర్లినా వాటిని సరిచేసుకునేలా అవకాశం కల్పించారు. ఆధార్ నెంబర్, పరీక్షా పేపర్, ఫొటో, సంతకం లాంటి అంశాలను ఎడిట్ చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఏమైనా సమస్యలుంటే టెక్నికల్ సిబ్బందికి అందుబాటులో ఉంచిన ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని అధికారులు కోరారు. ఇదిలా ఉంటే ఉపాధ్యాయులు టెట్ రాయాలని విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను జిల్లా విద్యాధికారులు ఆ ఉత్తర్వుల కాపీని ఎంఈవోలకు జారీ చేశారు.