calender_icon.png 1 May, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం కులగణన నిర్ణయం హర్షణీయం

01-05-2025 02:03:22 AM

  1. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా డ్రామాలు ఆపాలి..

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జన గణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయ మని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వాలు కులగణన పేరుతో తమకు అనుకూలమైన సర్వేలు చేపట్టి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న సమ యంలో కేంద్రమే ముం దుకు వచ్చి.. యావత్ భారతదేశమం తా కుల గణన చేపడతామని ప్రకటించడం శుభపరిణామని అభివర్ణించారు.

సెప్టెంబర్ నుంచి రెండేళ్లపాటు సర్వే జరగనున్నదని, కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు ఇప్పటికై కులగణన పేరి ట డ్రామాలు ఆపేయాలని హితవు పలికా రు. కాంగ్రెస్ కులగణనను రాజకీయ అస్త్రంగా వాడుకుంటూ.. ప్రజ ల్లో లేనిపోని ఆందోళనలు పుట్టిస్తున్నదని ధ్వజమెత్తారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికీ అలా చేయదని పేర్కొన్నా రు. ప్రజాప్రయోజనాలను కాపాడే విషయంలో చిత్త శుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. స్వాతంత్య్రానంతరం కులగణన జరగకూడదని కాంగ్రెస్ కోరుకుందని,  కాంగ్రెస్ మొదటి నుంచీ కులగణనకు వ్యతిరేకమని ఆరోపించారు.