calender_icon.png 22 January, 2026 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

22-01-2026 05:37:14 PM

మునుగోడు,జనవరి 22 (విజయక్రాంతి): కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్ లను తక్షణమే విరమించుకోవాలని సిఐటియు  మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు అన్నారు. ఫిబ్రవరి 12వ చేపట్టిన దేశవ్యాప్త సమ్మేలో భాగంగా గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి మునుగోడు ఎంపీడీవో గంగుల యుగంధర్ రెడ్డి కి సిఐటియు సమ్మె నోటీసును అందజేసి మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను, వాటి స్థానంలో నాలుగు కోడ్ లను చేసేందుకు గత సంవత్సరం నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని అన్నారు  విద్యుత్ సవరణ చట్టం 2025 ను రద్దు చేసి, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.జాతీయస్థాయిలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 న ఒక్కరోజు సమ్మె కు మండలంలోని కార్మికులందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిఐటియు మండల సీనియర్ నాయకులు రెడ్డి మల్ల యాదగిరి, మండల అధ్యక్షులు పెరమళ్ళ రాజీవ్,సైదులు,శ్రీకాంత్ ఉన్నారు.