22-01-2026 05:35:56 PM
కామారెడ్డి అర్బన్,జనవరి22(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిబిపెట్ మండలం యడారం గ్రామంలో త్రాగునీటి సమస్యపై గ్రామ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామంలోని 10 వార్డుల్లో నెలకొన్న త్రాగునీటి ఇబ్బందులకు పరిష్కారంగా బోర్లలో మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో గ్రామ ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి, వార్డు సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, ఐఓ భరత్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.