calender_icon.png 8 November, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

08-11-2025 08:23:09 PM

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి

మొయినాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకొని మత్స్యకార సంఘాలు మరింత ఆర్థికపురోభివృద్ధి సాధించాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు చెరువు వద్ద మత్స్యకార సంఘానికి జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ద్వారా చేపలు పట్టడానికి అవసరమయ్యే పడవలను శనివారం కొండా విశ్వేశ్వర్రెడ్డి అందించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 20, 30 ఏళ్ల క్రితం మత్స్యకార సంఘాలు లాభాల బాటలో పయనించాయని, ప్రస్తుతం మన రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తి లేని కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి చేప పిల్లలను తెచ్చి ఇక్కడ పెంచడం ఆర్థికంగా భారమవుతుందని.. అందువల్ల మత్స్యకార సంఘాలు లాభాలు ఎక్కువగా ఆర్థించడం లేదని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా మత్స్యకార సంఘాలకు అవసరమ్యే విధంగా ప్రస్తుత చట్టాలను మార్చి మత్స్యకారులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం. సీనియర్ నాయకులు గున్నాల గోపాల్రెడ్డి. ప్రభాకర్రెడ్డి, మత్స్యకార సంఘం నాయకులు శ్రీరాములు ముదిరాజ్, సంఘం నాయకులు ఉన్నారు. తమ సంఘానికి ఉచితంగా పడవలను అందించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఈ సందర్భంగా మత్స్యకార సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.