calender_icon.png 21 May, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్ళలో సమస్యలు ఉంటే కాల్ చేయండి..

20-05-2025 09:50:02 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్(Civil Supplies Officer Prem Kumar), సివిల్ సప్లై డిఎం కృష్ణవేణి(DM Krishnaveni) తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 7995050789 కు సమాచారం ఇస్తే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, లారీ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, కార్మికుల సమస్యలు సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు.