20-05-2025 08:54:22 PM
భద్రాచలం (విజయక్రాంతి): జూనియర్ ఎన్టీఆర్(Junior NTR)కి అభిమానులే కొండంత అండ అని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే అజీమ్ అన్నారు. మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు సందర్భంగా టీం తారక్ భద్రాచలం అభిమాన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సాయి, మణిదీప్ ఆధ్వర్యంలో కూనవరం రోడ్డు నందు ఉన్న సరోజినీ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేశారు.
ముందుగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... నేటి నుండి భద్రాచలంలో టీం తారక్ భద్రాచలం అభిమాన సంఘం ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం తారక్ భద్రాచలం గౌరవ సలహాదారులు విజ్జిగిరి రాజా కిరణ్, కోశాధికారి అనిల్, జాయింట్ సెక్రటరీ అరవింద్, ఎక్సక్యూటివ్ మెంబెర్స్ దుర్గాప్రసాద్, కర్రీ విజయ్, కొల్ల విజయ్ పార్ధు, అభిరామ్, రాజు, శ్రీను, సంపత్, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.