calender_icon.png 21 May, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోమారు విజృంభిస్తున్న కరోనా.. ముంబాయిలో ఇద్దరు మృతి

20-05-2025 09:34:08 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కోవిడ్-19 మరోమారు విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో ఏకంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా ముంబాయిలో కరోనా సోకి ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కారణంగా 14ఏళ్ల బాలుడు, మూత్రపిండాలు కారణంగా 54ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందారు. అయితే వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ అధికారిక గణనంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈనెల 19 నాటికి మొత్తం 257 కేసులు నమోదైనట్లు వివరణ ఇచ్చింది. ముఖ్యంగా ఈనెల 12వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 164 కొత్త కేసులు వెలుగు చూడడం ఆందోళన కల్గిస్తుంది. దేశంలో కోవిడ్-19 పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని కేంద్రం ప్రభుత్వ వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర 87, తమిళనాడు 34, కర్ణాటక 8, గుజరాత్ 6, హర్యానా, సిక్కిం, రాజస్థాన్ లలో ఒక్కొక్క కేసు నమోదైంది. అలాగే కేరళ 95 యాక్టిమ్ కేసులతో ముందంజలో ఉంది. కోవిడ్ సంబంధిత లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు సూచించారు.