calender_icon.png 21 May, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ ప్రాంత ఆర్ఎంపీ డాక్టర్లపై టీఎస్ఎంసి వేధింపులు ఆపాలి

20-05-2025 08:43:54 PM

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగూరి నర్సింహ..

మునుగోడు (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ లపై టీఎస్ ఎంసి వేధింపులు ఆపాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగూరి నర్సింహ(CPI District Executive Member Boluguri Narasimha) అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఆర్.ఎం.పి డాక్టర్లతో కలిసి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు ఏర్పాటు చేసుకున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై టీఎంసీ బృందాలు దాడులు చేస్తూ కేసులు నమోదు చేయడం బేషరతుగా విరమించుకోవాలని అన్నారు.

సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు గత వంద సంవత్సరలుగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆర్ఎంపీలను వేధించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులు సబ్ సెంటర్ లను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైతున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ ఆసుపత్రుల యజమానియాల ఒత్తిళ్లకు లొంగిన అధికారులు ఆర్ఎంపీలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. సమావేశంలో ఆర్ఎంపీల సంఘం మండల గౌరవ అధ్యక్షులు నలపరాజు వెంకన్న, మునుగోటి దయాకర్ సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీనివాసులు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బో మ్మరగొని లాలయ్య, లింగయ్య, యాదయ్య, దుబ్బ వెంకన్న, ఎండి జానీ ఉన్నారు.