29-08-2024 04:53:08 PM
ఖమ్మం, (విజయక్రాంతి): కోదాడ రూరల్ లోని గోదాములను గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు సందర్శించారు. గోదాముల్లో ఉన్న నిల్వలను ఆయన పరిశీలించారు. గోదాముల సామర్ధ్యం తో పాటు ఎంతమంది హమాలీలు ఉన్నారు లాంటి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని గోడౌన్ ఇంచార్జి కి నాగేశ్వరరావు సూచించారు. అనంతరం నాగేశ్వరరావు గోదాము ఆవరణలో మొక్కలు నాటారు.