calender_icon.png 22 January, 2026 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కోవలక్ష్మికి అస్వస్థత

29-08-2024 05:03:27 PM

హైదరాబాద్ కు తరలింపు

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్ కు గురువారం తరలించారు. గత మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో ఉన్న ఎమ్మెల్యే ఇంటి వద్ద వైద్యం తీసుకున్నారు. ఒకసారిగా లక్ష్మికి బీపీ షుగర్ లెవెల్స్ పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్లారు. కోవ లక్ష్మి అస్వతకు గురైన విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు ఆసుపత్రికి తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్యే సోదరి మస్కుల సరస్వతి పరమర్శించారు.