10-09-2025 06:23:34 PM
భూమి, భుక్తి, తెలంగాణ విముక్తికోసం ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుందాం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): దొరల పెత్తనానికి ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ పోరాటాలు నేటి తరానికి ప్రేరణ అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా(CPI District Secretary S. K. Sabir Pasha) అన్నారు. సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక శేషగిరిభవన్లో బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఐలమ్మ చిత్రపఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం, భక్తి కోసం, తెలంగాణ విముక్తికోసం చాకలి ఐలమ్మ అలుపెరగని పోరాటాలు చేసిందని, ఆనాటి భూసామ్య వ్యవస్థ, కట్టుబాట్లు, సామాజిక పరిస్థితులపై స్పందించిన ఆమె పెత్తందారి వ్యవస్థపై పోరాటానికి నాందిపలికి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
అగ్ర కులాలు, పెత్తందారుల పెత్తనానికి ఎదురునిలిచి పోరాడిన ధీరశాలి ఐలమ్మ అని, నమ్మిన సిద్ధాంతం కోసం తన అఖరి శ్వాస వరకు పోరాటం చేసిందని గుర్తు చేశారు. వెనుకబడిన సమాజానికి వెలుగురేఖ, చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, కె రత్నకుమారి, మామిడాల ధనలక్ష్మి, నేరెళ్ల రమేష్, ఎస్ విజయలక్ష్మి, నాయకులు శాపావట్ రవి, ఎస్ కె ఖయూమ్, కె రామకృష్ణ, బాజాజు రవి, వినయ్, సోమయ్య, జహీర్ తదితరులు పాల్గొన్నారు.