10-09-2025 08:21:19 PM
జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్(District Minority Welfare Officer Srinivas) పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా సమీపంలో అధికారులు, ఉపాధి హామీ కూలీలతో కలిసి వివిధ రకాల మొక్కలు నాటి, నీరు పోశారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని, విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గోపి,టీఏ దీపిక,పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లయ్య, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.