24-10-2025 07:37:13 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన దాదాపు 20 మంది పత్తి ఎరడానికి పని నిమిత్తం కనగర్తి-సుద్దాల గ్రామాల మధ్య ఉన్న చేనులోకి వెళ్ళగా తేనెటీగలు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సిరిసిల్ల ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు ఆయన సూచించారు.