24-10-2025 10:21:56 PM
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): పేదల సొంతింటి కల సాకారం చేయడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని మారుతిగూడా గ్రామంతో పాటు ఎక్స్ రోడ్డు హనుమాన్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు రూ.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధితో పాటు పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణంలో నాణ్యత పాటించాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు నేరుగా మేలు చేకూరుతుందని అన్నారు.