calender_icon.png 25 October, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిభట్లలో ఐదుగురు జూదరుల అరెస్టు

24-10-2025 09:21:26 PM

ఇబ్రహీంపట్నం: గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరం పైన ఆదిబట్ల పోలీసు దాడులు నిర్వహించి, ఐదుగురు జూదరులను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆదిబట్ల గ్రామ పరిదిలో ఉన్న సాంబయ్య ఫార్మ్ హౌస్ కు ముందు ఉన్న వరండాలో ఉన్న ఖాళీ స్థలంలో కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఆదిభట్ల ఎస్ఐ. వెంకటేష్ తన సిబ్బంది కలిసి రైడ్ చేశారు.

ఆరుగురు వ్యక్తులు పేకాట జూదం ఆడుతుండగా ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, భూపతిగళ్ల రాజు అనే వ్యక్తి తప్పించుకున్నట్లు  తెలిపారు. పట్టుబడిన వారిలో ఆదిభట్ల గ్రామానికి చెందిన పల్లె సాంబయ్య, గజ్జెల నర్సింహా, పల్లె ప్రకాష్, బుద్ధుల భాస్కర్, అదేవిధంగా నాదర్గుల్ గ్రామానికి చెందిన కందికంటి మహిరాజ్ లు ఉన్నారు. వీరి వద్ద నుండి రూ.25,050/- నగదు, 5 మొబైల్ ఫోన్లు, ఆటకు ఉపయోగిస్తున్న 2 సెట్ ల పేక ముక్కలను ఆదిబట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.