24-10-2025 09:29:59 PM
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్
వనపర్తి(విజయక్రాంతి): ఖరీఫ్ 2024-2025 సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు. శుక్రవారం పానగల్ మండలం, గోపలాపూర్ గ్రామంలోని భాగ్య లక్ష్మి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖరీఫ్ 2024-2025 సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గోపాల్‌పేట గోడౌన్‌లో ఇప్పటికే నిల్వ ఉంచిన ధాన్యం యొక్క నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. డి సి ఎస్ ఓ కాశి విశ్వనాథ్, డి ఎం జగన్మోహన్ పాల్గొన్నారు.