24-10-2025 09:32:27 PM
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
మహమ్మదాబాద్: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నంచర్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని. నంచర్ల గ్రామానికి చెందిన సొప్పరి చందన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అయ్యారు. ఎసీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సి.చందన అద్భుత ప్రతిభ కనబరచడంతో ఆమెకు జాతీయ జట్టులో చోటు దక్కింది. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే డా. టి.రామ్మోహన్ రెడ్డి నంచర్ల పాఠశాలకు వెళ్లి విద్యార్థినిని అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చందన తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ తమ పిల్లలను చదివిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలిని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడల ప్రోత్సాహం పెరిగిందని ఇది నిదర్శనమని తెలిపారు. చందన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, తల్లిదండ్రులు సొప్పరివిజయలక్ష్మి. దస్తయ్యలకు. రాష్ట్రానికి,దేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నారు.