calender_icon.png 25 October, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

24-10-2025 09:17:16 PM

సింగిల్ విండో మాజీ డైరెక్టర్, రామలక్ష్మీపురం ఆలయ వైస్ చైర్మన్ అన్నెం నర్సింహారెడ్డి

కోదాడ: హుజూర్ నగర్ పట్టణంలో నేడు, రేపు నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో మాజీ డైరెక్టర్, రామలక్ష్మీపురం ఆలయ వైస్ చైర్మన్ అన్నెం నర్సింహారెడ్డి శుక్రవారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్ నుండి ఎంబీఏ వరకు చదివి,18-40 సం.రాల మధ్య వయస్సు కలిగిన ప్రతి నిరుద్యోగి క్యూఆర్ కోడ్ ద్వారా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

అలాగే తమ వెంట ఐదు సెట్లు రెజ్యూమ్ లు తీసుకెళ్లాలని సూచించారు.ఈ జాబ్ మేళాలో పాల్గొంటే నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి లు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక రంగాలలో జిల్లాను హుజూర్ నగర్, కోదాడ ను అభివృద్ధి చేయడానికి మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి లు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు