24-10-2025 07:33:10 PM
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ,(విజయక్రాంతి): రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూ.19 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించిన మహిళా మండలి భవనాన్నిఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళా సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త భవనం మహిళా సంక్షేమ కార్యక్రమాలు, స్నేహ సమూహ సమావేశాలు, సామూహిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందన్నారు. మహిళలకు అన్ని పథకాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ వస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో వేగవంతమైన పురోగతి సాధించామని ఆయన స్పష్టం చేశారు.