24-10-2025 09:27:21 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కేంద్రంలోని పెద్దమ్మగడ్డ సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థినులకు అందిస్తున్న నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ కోచింగ్ గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు. అదేవిధంగా కిచెన్ షెడ్ ను పరిశీలించి విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా డిటిడిఓ ప్రేమ కళ, ఆర్సిఓ డీఎస్ వెంకన్న, ప్రిన్సిపల్ పద్మిని, అధ్యాపకులు పాల్గొన్నారు.