24-10-2025 09:24:50 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సుధీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు విభాగాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా తాండూర్ మున్సిపాలిటీకి ఎన్ని ఇందిరమ్మ ఇండ్ల వివరములు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ కి ఇందిరమ్మ టార్గెట్ ఎంత ఉందని ప్రశ్నించగా 471 ఇండ్లు టార్గెట్ ఉండగా అందులో 156 మంది లబ్ధిదారులను అర్హులను గుర్తించి ఆన్లైన్ ప్రక్రియ చేపట్టడం జరిగిందని మేనేజర్ నరేందర్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని వార్డు ఆఫీసర్లను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ డి ఈ మణిపాల్, మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.