calender_icon.png 31 January, 2026 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలో ఢిల్లీ విజయవంతం చేయాలి

31-01-2026 03:44:42 PM

పిఆర్టియు టి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఏఐఎఫ్ టిఓ పిలుపు మేరకు పిఆర్టియు టి ఎస్ ఆసిఫాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, జనకాపూర్ ఉన్నత పాఠశాలల్లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించి 2010కి ముందు నియమితులైన సేవలో ఉన్న ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులపై టెట్ పేరుతో అన్యాయం చేయడం సరికాదన్నారు.

ఫిబ్రవరి 5న నిర్వహించనున్న ధర్నాకు జిల్లాలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు గోర్ సింగ్,కుమ్మరి రవి,  విజేష్ వెంకటేశ్వర్లు, దుర్గం అనిల్ కుమార్,  శ్రవణ్ కుమార్, సోనేరావు, ప్రవీణ్,  రమేష్, ధనరాజ్, హేమంత్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.