calender_icon.png 31 January, 2026 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి చర్యలు

31-01-2026 03:26:03 PM

జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

షాద్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్

షాద్‌నగర్,(విజయక్రాంతి): ఎన్నికల ప్రక్రియను సజావుగా జరపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మున్సిపల్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 11న జరగబోతున్న షాద్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటను, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎన్నికల పర్యవేక్షకుడు మయాంక్ మిట్టల్ పర్యవేక్షించారు. శనివారం స్థానిక మున్సిపాలిటీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న స్క్రూటిని ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాటు తదితర ప్రక్రియ గురించి అసిస్టెంట్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికలకు సంబంధించిన ఫర్నిచర్ అదేవిధంగా స్టేషనరీ తదితర అంశాలను తెలుసుకొని వాటిని పరిశీలించారు. నామినేషన్లకు సంబంధించి స్క్రూటిని ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అశ్రద్ధ చేయకూడదని సజావుగా జరిగే విధంగా అధికారులు సిబ్బంది అందరూ కృషి చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను ప్రక్రియను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎన్నికల అనంతరం ఈనెల 13న జరగబోయే కౌంటింగ్ తదితర ఫలితాల ఏర్పాట్లు ఇండోర్ స్టేడియంలో చేసినట్లు స్థానిక అధికారి సునీతా రెడ్డి తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డిఓ సరిత తదితరులు ఉన్నారు.