calender_icon.png 31 January, 2026 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి

31-01-2026 03:47:05 PM

బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. హరిత దంపతులు

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న జిల్లా కలెక్టర్ కె. హరిత దంపతులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ కమిషనర్ వేణుగోపాల్ కలెక్టర్ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.