25-01-2026 01:01:49 AM
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధుసూదన్‌రెడ్డి కన్నుమూత
ఎల్బీనగర్, జనవరి 24: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చంపాపేట డివిజన్ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు, జీహెచ్‌ఎంసీ ఫ్లోర్ లీడర్ వంగ మధుసూదన్‌రెడ్డి(55) శనివారం మృతి చెం దారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నానక్‌రామ్ గూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ప్రజా సేవలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా గుర్తింపు పొం దిన మధుసూదన్ రెడ్డి, డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. ఆయన మృతదేహాన్ని ప్రజల దర్శనార్థం కర్మన్‌ఘాట్‌కు తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధుసూదన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రజాప్రతి నిధులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, స్థానికులు సంతాపం తెలిపారు.