calender_icon.png 25 January, 2026 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి రికార్డులన్నీ సీజ్ చేయాలి

25-01-2026 01:03:46 AM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఏటీఎంగా సింగరేణి

అందరినీ సాక్షిగా పిలిస్తే.. అసలు ఫోన్‌ట్యాపింగ్ దోషులెవరు?

కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): సింగరేణి రికార్డులన్నీ వెంటనే సీజ్ చేయాలని, సింగరేణి రికార్డులను తారుమారు చేసే ప్రమాదముందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సింగరేణిని ఏటీఎంగా వాడుకుంటున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణి గనుల కేటాయింపు, అక్రమాలు, నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్‌లకు కాంగ్రెస్ ప్రభు త్వం క్లీన్ చిట్ ఇస్తుందా అని ప్రశ్నించారు.

శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ తదితరులతో కలిసి విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా ముచ్చటించా రు. నాడు బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ పాలకులు సింగరేణిని దోచుకుంటున్నాయని చెప్పారు. నైనీ బొగ్గు గనుల టెండర్ ప్రక్రియ సహా  2014 నుండి నేటి వరకు సింగరేణిలో జరిగిన అక్రమాలు, దోపిడీకి సంబంధించిన రికార్డులన్నీ తక్షణమే సీజ్ చేయాలని డి మాండ్ చేశారు.

కాంగ్రెస్ అవినీతిపై హరీశ్ రావు లేఖ రాస్తే... బీఆర్‌ఎస్ అవినీతిపై కూడా విచారణ జరుపుదామా? అని మం త్రి భట్టి చెబుతూ టైంపాస్ చేసుకుంటున్నారే తప్ప విచారణ మాత్రం జరపడం లేదన్నా రు. తెలంగాణలో జరిగిన దోపిడీపై మాట్లాడుతుంటే... ప్రజల దృష్టిని మళ్లించేందుకు గుజరాత్ గురించి మాట్లాడుతూ పసలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారం రోజుల తరువాత సింగరేణి భాగోతాన్ని దారి మళ్లించేందుకు మరో అంశాన్ని ఈ రెండు పార్టీలు తెరపైకి తెస్తారని చెప్పారు.

“ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను సాక్షిగా పిలిచామని మంత్రులు చెబుతుంటే విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారు. ఏది నిజం? కేటీఆర్, కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా? కేటీఆర్, హరీశ్ సహా అందరినీ సాక్షిగా పిలిస్తే... అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరు? దొంగలను సాక్షులుగా పిలవడమేంటి?”అని ప్రశ్నించారు. సిట్‌ను ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రులు ప్రభావితం చేస్తున్నారని అన్నా రు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కు టు ంబ సభ్యులతో దేవుడి ముందు కేసీఆర్, కేటీఆర్ ప్రమాణం చేస్తారా అని సవాల్ చేశారు.