07-07-2025 08:24:03 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): మాలలను అవమానపరిచిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) సమ్మయ్యలపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో సోమవారం మాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల జాతి యుద్ధ వీరుడు మాల కన్నమదాసు చిత్రపటాన్ని అవమాన పరుస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పరకాల సమ్మయ్య గౌడ్ లు కన్నమదాసు తల భాగంలో కౌశిక్ రెడ్డి తల ఫోటో పెట్టి వాట్సప్ గ్రూపులలో ఫోటోలను సర్కులేట్ చేస్తూ అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మాలలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా మాలల ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొల్లు బాబు, నరేష్,రాహుల్, రాజు, పసుల స్వామి, అనిల్, కుమార్, విజేందర్, రమేష్, నాగరాజు, రవితేజ తో పాటు తదితరులు పాల్గొన్నారు.