calender_icon.png 8 July, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు

07-07-2025 08:54:44 PM

జిల్లాలో ఎమర్జెన్సీ పాలన తలపిస్తోంది అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం..

బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మణ్ బాబు...

ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మణ్ బాబుని హౌస్ అరెస్టు చేయగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున లక్ష్మణ్ బాబు ఇంటికి తరలివచ్చి హౌస్ అరెస్టుకు నిరసన తెలియజేస్తూ భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వ పరిపాలన వ్యతిరేకంగా నినాదిస్తూ ముందుకుసాగుతూ లక్ష్మణ్ బాబు ఇంటి నుండి బస్టాండ్ వరకు ర్యాలీలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు విషయంలో అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతుందని ఇందిరమ్మ ఇల్లురాని లబ్ధిదారులు ఇల్లు కావాలని వాట్సాప్ లలో మెసేజ్ పెడుతూ అర్హులైన వారికి రావట్లేదని మెసేజ్లు పెడితే కాంగ్రెస్ గుండాలు బెదిరించి ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా పాల్పడుతున్నారని ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు మండిపడ్డారు ములుగు జిల్లాలో సీతక్క ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ పరిపాలన నడుస్తుందని ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలను గుర్తు చేసుకునే విధంగా ఉందని ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు.