calender_icon.png 8 July, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది

07-07-2025 08:47:22 PM

ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడతాం..

రాష్ట్ర పంచాయతీ రాజ్, మంత్రి  సీతక్క..

ఏటూరునాగారం (విజయక్రాంతి): ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడతామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) అన్నారు. సోమవారం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణము అంచనా విలువ రూ.55 లక్షల పనులను ఎన్ హెచ్ 163 చిన్నబోయినపల్లి నుండి పెద్ద వెంకటాపూర్ వరకు ఒక కోటి 60 లక్షల నిధులతో బిటి రోడ్డు నిర్మాణం, షాపల్లి గ్రామంలో 70 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్(District Collector Divakara T.S)తో కలసి శంకుస్థాపన చేశారు.

చిన్నబోయినపల్లి నేషనల్ హైవే రోడ్డు మార్గంలో వనమహోత్సవంలో భాగంగా  కలెక్టర్ తో కలసి మంత్రి మొక్కలను నాటారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అన్నారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అందరు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. దశలవారీగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడతామని అన్నారు.