07-07-2025 08:12:55 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): క్యాతన్ పల్లి పురపాలకం 9వ వార్డులో ఈ నెల 20న జరిగే ఆషాడ మాసం గాంధారి మైసమ్మ బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు సిఐ శశిధర్ రెడ్డి(CI Shashidhar Reddy) పేర్కొన్నారు. సోమవారం గాంధారి మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయం పరిసరాలను, ఏర్పాట్లను రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మైసమ్మ బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్దఎతున్న బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య, గౌరవ అధ్యక్షుడు పరుపెళ్లి తిరుపతి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, భీమ సుధాకర్, కందునూరి రాజన్న, మోగిలి కనుకయ్య, గుండా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.