calender_icon.png 8 July, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

07-07-2025 08:20:31 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలో ఎమ్మార్పీఎస్(MRPS) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ బజార్ చౌరస్తాలో గల ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాచర్ల సరేష్ మాట్లాడుతూ... 30 ఏళ్లుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కన్నూరి రాజేందర్, ఆరింద సతీష్, రేణిగుంట్ల పోశం, కాదాసి సంపత్, ఆర్ముల పోశం, సలిగొమ్ముల రమేష్, దాసరపు ఆగయ్య, రామిళ్ళ మల్లేష్, పూర్ణచందర్, కలువల శ్రీనివాస్, కలువల శంకర్, కనుకుట్ల సుభాష్, గట్టయ్య, స్వామి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.