07-07-2025 08:26:25 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పలు పనులను కేంద్ర బృందం తనిఖీ చేసింది. సోమవారం మండలంలోని బొక్కలగుట్ట, పులిమడుగు, అందుగుల పేట, సారంగపల్లి, శంకర్ పల్లి, చిర్రకుంట, ఆదిల్ పేట, మామి డిగట్టు, పొన్నారం, వెంకటా పూర్ గ్రామపంచాయతీలలో 2023, 2024 సంవత్సరాలలో చేపట్టిన పలు పనులను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు.
భూగర్భ జలవనరుల శాఖ అధికారి(సైంటిస్ట్) కె రాంబాబు ఆధ్వర్యంలో మండలంలోని 10 గ్రామపంచాయతీ లను మూడు బృందాలుగా విభజించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో చేపట్టిన నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, మినీ కుంటలు తదితర భూగర్భ జలాలకు సంబంధించిన పనులను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, డిఆర్డిఏ కార్యాల యం అధికారులు మధు, కుమార్, ఏపీఓ రజియా సుల్తానా, సదానందం, మధు, ఈసీ మధు, టిఏ రాజమల్లు, కుమార్, తిరుమల్ గౌడ్ గారు , ఫీల్డ్ అసిస్టెంట్లు చెట్టి సత్య నారాయణ, లింగాల రాజేంద ర్, భూక్యా భూమా, ఈద లింగయ్యలు పాల్గొన్నారు.