07-07-2025 09:04:50 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): రాయపోల్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, కళాశాల(Kasturba Gandhi Girls School & College)లో అతిథి అధ్యాపక ఇంగ్లీష్ పోస్టుకు అర్హులైన మహిళ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరణకు సంబంధించిన గడువును ఈనెల 10 తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి(Mandal Education Officer Satyanarayana Reddy) తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాయపోల్ కేజీబీవీ కళాశాలలో ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగానే ఎంపిహెచ్డబ్ల్యు, ఎమ్మెల్టీ రెండు గ్రూపులకు సంబంధించిన పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలియజేసారు. దీనికి సంబంధించి ఇంగ్లీషు సబ్జెక్ట్ బోధించుటకు బీఈడీ, ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసిన వారు అర్హత కలిగిన వారు దరఖాస్తు కోసం కేజీబీవీ పాఠశాల కార్యాలయంలో ఈ నెల 10 వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తు చేసుకోగలరని పేర్కొన్నారు.