calender_icon.png 8 July, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

07-07-2025 08:50:12 PM

అనంతగిరి: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఎమ్మార్పీఎస్(MRPS) 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కలకొండ నాగరాజు, ఎంఎస్పి గ్రామ శాఖ అధ్యక్షుడు కలకొండ శేఖర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకార కొండలు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి ప్రవీణ్, కొండేటి కోటయ్య మేళ్లచెరువు గురవయ్య నందిగామ అశోక్ గూడపురి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.