calender_icon.png 8 July, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిర్యాల గ్రామంలో ఘనంగా 31వ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

07-07-2025 08:43:24 PM

నూతనకల్ (విజయక్రాంతి): మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో ఎమ్మార్పీఎస్(MRPS) 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకపు మల్లేష్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ నూతన దిమ్మెను నిర్మించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రధాన కార్యదర్శి ఇరుగు కిరణ్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కొమ్ము పరమేష్, కొమ్ము రవీందర్, కొమ్ము సురేష్ తదితరులు పాల్గొన్నారు.