calender_icon.png 8 September, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘట్‌కేసర్ రెడ్డి సంఘం అధ్యక్షుడిగా చందుపట్ల వెంకటరెడ్డి

02-09-2025 12:00:00 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 1: ఘట్ కేసర్ రెడ్డి సంఘం నూతన అధ్యక్షులుగా చందుపట్ల వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. రెడ్డి సంఘం అధ్యక్ష పదవికి కందకట్ల మాధవరెడ్డి, చందుపట్ల వెంకట్ రెడ్డి పోటీ పడ్డారు. ఎన్నికల ఫలితాల్లో చందుపట్ల వెంకట్ రెడ్డి, కందకట్ల మాధవ రెడ్డి పై 82 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా కొమ్మిడి శివ ప్రదీప్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్లుగా పలుగుల శ్రీకాంత్ రెడ్డి, సుడి శ్రీకాంత్ రెడ్డి సంయుక్త కార్యదర్శిగా కంభం లక్ష్మా రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బీరెడ్డి రవీందర్ రెడ్డి ఇతరులు ఎన్నికయ్యారు.

ఈసందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి, యువతలో ఐకమత్యం, విద్యార్థుల ప్రోత్సాహం, సామాజిక సేవ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, పాత కమిటీ చేసిన సేవలను ప్రశంసిస్తూ, వారి సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కొమ్మిడి రాఘవ రెడ్డి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.