02-09-2025 12:00:00 AM
హుజూర్ నగర్, సెప్టెంబర్ 1: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్ నియోజకవ ర్గాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కు హాజరవుతారని మంత్రి కార్యాలయ పిఆర్‌ఓ వెంకటరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంత్రి ఉత్తమ్ పర్యటన వివరాలు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండల కేంద్రంలో రూ.4 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం ప్రారంభోత్సవం, రూ.2.31 కోట్లతో హుజూర్ నగర్ మండలంలో వేపల సింగారం నుండి కందిబండ వరకు బీటీ రోడ్డు శంఖు స్థాపన, రూ 6.50 కోట్లతో హుజూర్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుండి మోడల్ కాలనీ వరకు డబుల్ రోడ్డుకు శంఖుస్థాపన,
రూ 2.20 కోట్లతో హుజూర్ నగర్ మండలంలో లక్కవరం నుండి మగ్దుం నగర్ వరకు బీటీ రోడ్డు శంఖుస్థాపన,కోదాడ నియోజకవర్గం లోని రూ.5.10 కోట్లతో కోదాడ పట్టణంలో ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం నూతన భవన శంఖుస్థాపన,రూ.54 కోట్లతో కోదాడలో రాజీవ్ శాంతి నగర్ ఎత్తిపోతల పధకం శంఖుస్థాపన,రూ.10 కోట్లతో చిలుకూరు మండలం, సీతారాంపురం (గోదాం దగ్గర) ఎన్ హె- 167 మెయిన్ రోడ్డు నుండి యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ కాంప్లెక్స్ స్థలం వరకు అప్రో బీటీ డబుల్ లైన్ రోడ్డు శంఖుస్థాపన చేయనున్నారని ఈ మేరకు తెలిపారు.