calender_icon.png 3 August, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీతోనే మారుమూల ప్రాంతాల అభివృద్ధి

03-08-2025 07:24:39 PM

చందూర్ గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవాలు 

ఉమ్మడి నిజాంబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క

బాన్సువాడ,(విజయక్రాంతి): మారుమూల ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని మోస్రా, చందూర్ మండలాల పలు అభివృద్ధి పనులు ఆదివారం ఆమె ప్రారంభించారు. మోస్రాలో  మండల సముదాయ భవనాలు, మోస్రా లో జనరల్ ఫంక్షన్ హాల్, చందూర్ గ్రామపంచాయతీ భవనాల ను ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద మహిళల ను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే లబ్ధి పొందుతారని గత ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదన్నారు.

ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాదు పార్లమెంటు సభ్యులు సురేష్ శెట్కర్ లు మాట్లాడుతూ... గత పది సంవత్సరాలుగా పేద ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు గత ప్రభుత్వానికి లేవన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో పేద ప్రజలకు రేషన్ కార్డులు అందిస్తున్న ఘనత దక్కిందన్నారు.