03-08-2025 09:50:25 PM
దళిత,బహుజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి
అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య
మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 337వ ఆదివారం జ్ఞానమాల ఘనంగా సమర్పించారు. ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ... ఆగస్టు 06 నాటికీ చుండూరు మారణకాండ జరిగి 34 సంవత్సరాలు గడుస్తున్నా సందర్భంగా మృతువీరులకి నివాళులు అర్పిస్తున్నామన్నారు.
డా.బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నేటికి అమలు కావడం లేదని, సుమారు 80 ఏళ్ల ఈ స్వాతంత్ర భారత దేశంలో ఇంకా దళితుల పైన దాడులు, మానభంగాలు జరగడం దురదృష్టకరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా రాజ్యాంగాన్ని అమలు చేయకపోవడంతో ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు ఇంకా నిరుపేదవారిగా మిగిలారని, బడుగు, బలహీన, దళిత బహుజనల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నత్తి మైసయ్య డిమాండ్ చేశారు.