calender_icon.png 4 August, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాడిపంటలకు, ఆయురారోగ్యాలకు గ్రామదేవతల ఆశీస్సులే...

03-08-2025 08:56:05 PM

ప్రభ బండి ప్రారంభించిన నాయకులు లక్ష్మీ నారాయణ రెడ్డి, వంగవీటి రామారావు 

కోదాడ: గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం ముత్యాలమ్మ పండుగ సందర్భంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎడ్ల బండి ప్రభను ముస్తాబు చేసి భారీ ఊరేగింపుతో ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆయన మాట్లాడుతూ... ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. పాడి పంటలకు ఆయుర్ ఆరోగ్యాలకు గ్రామదేవతల ఆశీస్సులు ఉండాలన్నారు.

ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. పట్టణ ప్రజలకు ముత్యాలమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి ప్రభ ముస్తాబుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడ్ల బండి భారీ ప్రదర్శనతో పట్టణంలో గత సంస్కృతి సంప్రదాయాలు కనిపించాయి ప్రజలంతా ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. కాగా తొలుత ఎర్నేని ఇంటి వద్ద ప్రభ బండిను టీపీసీసి డెలిగేట్ సీహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావులు ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు రావేల కృష్ణారావు పాల్గొన్నారు.